రేపు న్యూజెర్సీలో ' గోదావరి ' 43వ శాఖ ప్రారంభం

Featured Image

2015లో బోస్టన్‌లో ప్రవాసాంధ్రుడు కోగంటి కౌశిక్ ఆధ్వర్యంలో ప్రారంభించిన 'గోదావరి ' రెస్టారెంటు అమెరికా-కెనడాల్లో 42 శాఖల్లో భారతీయ రుచులను ప్రవాసులకు, అమెరికన్లకు చేరువ చేస్తోంది. ఇందులో భాగంగా తమ 43వ శాఖను న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ సిటీలో ఇండియ స్క్వేర్‌లో ప్రారంభించనున్నారు. ఇండియన్ స్ట్రీట్‌లోని భారతీయ హోటళ్లలో ఇదే అతిపెద్ద శాఖ అని కౌశిక్ అన్నారు.

గోదావరితో పాటు న్యూయార్క్ టైమ్‌స్ స్క్వేర్‌లో తొలి భారతీయ రెస్టారెంట్ మద్రాస్ దోశా కంపెనీని సైతం కౌశిక్ నిర్వహిస్తున్నారు. బోస్టన్‌లో 2021లో ప్రారంభమైన మద్రాస్ దోశ కంపెనీ బోస్టన్‌లో రెండు, ప్రిన్స్‌టన్‌లో ఒకటి, న్యూయార్క్‌లో నాలుగు శాఖల ద్వారా భారతీయ టిఫిన్లను అతిథులకు వడ్డిస్తోంది.

మరిన్ని వివరాలకు - www.madrasdosaco.com లేదా www.godavarius.com చూడవచ్చు.

Tags-Godavari Restaurant 43rd Branch Grand Opening In Jersey City NJ

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles