శాక్రిమెంటోలో సాంప్రదాయ కళల పండుగ

Featured Image

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రిమెంటో(TAGS) ఆధ్వర్యంలో నాట్య గాన కళా వేదిక పేరిట సాంప్రదాయ కళల పండుగ రాంచో కార్డోవాలోని కార్డోవా హైస్కూల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఆరు గంటల పాటు ఈ కళా ప్రదర్శనలు సాగాయి. వినాయక ప్రార్థనతో ప్రారంభమైంది. స్థానిక కళాకారులు తమ ప్రతిభను చాటుతూ ప్రదర్శించిన భరతనాట్య, కూచిపూడి, కర్నాటక సంగీత కచేరీ, భక్తి గీతాలాపన, ఏకపాత్రాభినయం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

సాంస్కృతిక కార్యక్రమాలకు ముందు టాగ్స్-వైటలెంట్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. 15 మంది టాగ్స్ సభ్యులు రక్తదానం చేశారు. యూత్ అడ్వైజరీ బోర్డ్ సభ్యుడు నమిష్ దొండపాటిని అభినందించారు.

సంస్థ అహ్ద్యక్షుడు శ్యామ్ యేలేటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో శ్రీ శ్రీనివాస కళ్యాణం, సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయవల్సిందిగా కోరారు. అనంతరం సువిధ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు భాస్కర్ వెంపటిని టాగ్స్ చైర్మన్ నాగ్ దొండపాటి, శ్యామ్ యేలేటి, కార్యవర్గ బృందం ఘనంగా సత్కరించారు. ఉపాధ్యక్షుడు శంకరి చీదెళ్ల తదితరులు కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. www.sactelugu.org వెబ్‌సైట్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

Tags-TAGS Sacremento Telugu Cultural Festival 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles