తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆటా సహకారంతో మంచినీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు

Featured Image

తెలుగు రాష్ట్రాల్లో అమెరికా తెలుగు సంఘం(ఆటా) చేస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీదేవి అన్నారు. జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సహకారంతో, ఆ సంస్థ బోర్డు ఆఫ్ ట్రస్టీ విష్ణు ప్రకాష్ రావు మాధవరం స్వంత నిధులతో నిర్మించిన ప్రహరీ గోడ, ఆర్వో వాటర్ ప్లాంట్ ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన, విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, టిఫిన్ బాక్సులు షూల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, తదుపరి అధ్యక్షుడు సతీష్ రామసహాయం రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, డిఇఓ రాము తదితరులతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ శ్రీదేవి మాట్లాడుతూ సేవ కార్యక్రమాలు చేపడుతున్న ఆటా కార్యవర్గ కమిటీకి అభినందనలు తెలిపారు. ఆటా ఈ రోజు చేసిన కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడతాయని అన్నారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు మాతృభూమిపై ప్రేమతో గ్రామీణ విద్యాభివృద్ధికి సహకరించడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యుడు విష్ణు మాధవరం స్వంత నిధులతో ఈ అభివృద్ధి పనులను చేపట్టడం ఆదర్శనీయమన్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగేలా చేస్తాయని అన్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి స్వంత నిధులతో ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించినట్లు అవుతుందన్నారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, తదుపరి అధ్యక్షుడు సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ...ఆటా సేవ కార్యక్రమాలల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విష్ణు మాధవరం తమ బృందంలో ఉండటం గర్వంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కో-చైర్ నరసింహ ద్యాసాని, సభ్యుడు విష్ణు మాధవరం, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా, ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags-ATA Supports Timmapur ZPHS Through BOT Vishnu Madhavaram Financial Assistance

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles