ఆస్ట్రేలియా...మెల్బోర్న్‌లో తెలుగు సంక్రాంతి

Featured Image

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో నివసిస్తున్న తెలుగు ప్రవాసులు సాంప్రదాయ రీతిలో సంక్రాంతి సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, లక్ష్మిదేవి పూజ, సంక్రాంతి ఆటలు, పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు, జానపద పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా తెలుగు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న మహిళలు, యువత, పండుగ శోభను మరింత పెంచారు.

కార్యక్రమానికి హాజరైన పెద్దలు మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. పిల్లలకు భారతీయ విలువలు, పండుగల ప్రాముఖ్యత తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ తెలుగు వంటకాలు — అరిసెలు, గారెలు, బొబ్బట్లు, పాయసం వంటి వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిర్వాహకులు లగడపాటి సుబ్బారావు, గోపి నంబాళ్ళ, రామ్ ముప్పానేని, హరి శేఖర్ గౌడ్, స్నేహలత రెడ్డి కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Tags-Melbourne Australia Telugu NRIs Celebrate Sankranti

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles