ఉత్సాహంగా గ్రేటర్ బోస్టన్ తెలుగు సంఘం సంక్రాంతి

Featured Image

43 ఏళ్ల క్రితం ఏర్పడిన గ్రేటర్ బోస్టన్ తెలుగు సంఘం(TAGB) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక బెల్లింగ్‌హామ్ హైస్కూల్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రవాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ గొంది మాట్లాడుతూ ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను అన్ని తరాల వారిని అలరించేలా నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేశామని, సభ్యులు ఒకే చోట చేరి మన పండుగను జరుపుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. 2026-27 నూతన కార్యవర్గం సంస్థను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు.

ప్రముఖ గాయని షణ్ముఖప్రియ సంగీత విభావరి ప్రధాన ఆకర్షణగా అలరించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ట్రస్టీ బోర్డు చైర్మన్ అంకినీడు రావి మాట్లాడుతూ వేడుకల విజయానికి అందరి సమన్వయం దోహదపడిందన్నారు. సంస్థ సామాజిక బాధ్యతను, సాంస్కృతిక విలువలను కాపాడటంలో ముందుంటుందన్నారు. వేడుకల్లో భాగంగా..27 వాణిజ్య స్టాళ్లు ఏర్పాటు చేశారు. తిరుపతి లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

Tags-Boston TAGB Celebrates Telugu Sankranthi 2026,telugu association of greater boston tagb,gondhi srinivas tagb,boston telugu news

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles