చికాగోలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

Featured Image

చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో పోటీదారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించారు.

సంస్థ 2026 అధ్యక్షురాలు తమిశ్రా కొంచాడా సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో పిల్లలకు భోగిపళ్లు పోశారు. సంస్థ చైర్మన్ రాఘవ జాట్ల, ఉపాధ్యక్షులు రామకృష్ణ, సాహితి కొత్త, రమ్య మైనేని, పద్మారావు అప్పలనేని ముగ్గుల పోటీ ఏర్పాట్లను సమన్వయపరిచారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ ఉమా కటికి, రమ్య రోడ్డఒ, మల్లీశ్వరి పెదమల్లులు వ్యవహరించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.

సంస్థ కార్యనిర్వాహక సభ్యులు వారి ఇళ్ల వద్ద తయారు చేసిన సంక్రాంతి విందు భోజనాన్ని అతిథులకు వడ్డించారు. మాల్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన ఈ వేడుకలకు శృతి కూచంపూడి, సుజాత అప్పలనేని, రమ్య మైనేని, పద్మజ గండ్ర, హరిణి మెడ, సుభాష్ చేపలమడుగు, సురేష్ ఐనపూడి, కిరణ్ వంకాయలపాటి, ధర్మేంద్ర గాలి, సురేష్ మహాలి, స్వర్ణ నీలపు, సునీతా రాచపల్లి, శ్రీస్మిత నండూరి, మురళీ రెడ్డివారి, రామారావు కొత్తమాసు, శ్రియ కొంచాడ, దివిజ చల్లా, జై అనికేత్ మెడబోయిన, లక్ష్మినాగ్ సూరిభొట్ల, శ్రీనివాస్ సుబుద్ది సహకరాం అందించారు. సంస్థ కార్యదర్శి నరసింహారెడ్డి ఒగ్గు వందన సమర్పణ చేశారు.

Tags-Chicago Andhra Assoc CAA 2026 Telugu Sankranti And Rangoli Competition

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles