మన్నవ ఆధ్వర్యంలో...శకటాలతో వినూత్నంగా లోకేష్ జన్మదిన వేడుకలు

Featured Image

ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని వినూత్నంగా వివిధ శకటాలతో భారీ ర్యాలీ నిర్వహించి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి శాసనసభ్యుడిగా, రాష్ట్ర విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా లోకేష్ సాధించిన విజయాలను, చేసిన అభివృద్ధిని చాటి చెప్తూ ఒక్కొక్క శకటంలో వివరించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా - యువగళం పాదయాత్ర, కోటి సభ్యత్వాలు, కార్యకర్తలకు 5 లక్షల భీమా, నిరంతర ప్రజా దర్బారులు.

మంగళగిరి శాసనసభ్యుడిగా - 39 ఏళ్ళ తరువాత మంగళగిరిలో తెలుగుదేశం గెలుపు, రికార్డు మెజారిటీ, మంగళగిరిలో 3000 ఇళ్ల పట్టాల పంపిణి, 100 పడకల ఆసుపత్రి, మోడల్ లైబ్రరీ, మోడల్ స్కూల్, పార్కులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో మంగళగిరిని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ధటం.

విద్యామంత్రిగా - 16,437 ఉపాధ్యాయ పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చెయ్యటం, విద్యా మంత్రిగా ఎన్నో సంస్కరణలు, మార్పులు - పేరెంట్స్ టీచర్స్ మీట్, నో బ్యాగ్ డే, రాజకీయ పార్టీ రహిత యూనిఫామ్, ప్రతి నియోజకవర్గంలో మోడల్ స్కూల్ ఏర్పాటు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచితంగా కోచింగ్, స్టడీ మెటీరియల్, స్కిల్ డెవలప్మెంట్ తరగతులు.

ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా - వాట్సాప్ గవర్నెన్స్, 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో గూగుల్ డేటా సెంటర్, IBM, Microsoft, TCS, Accenture, Cognizant తదితర దిగ్గజ కంపెనీలతో పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పని చెయ్యటం, అమరావతిలో క్వాంటం వాలీ.

లోకేష్ చొరవతో తీసుకొచ్చిన ప్రగతిని, సాధించిన విజయాలను, చేసిన అభివృద్ధిని ప్రజలకు చాటి చెప్పేవిధంగా శకటాలను రూపకల్పన చేశారు. గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో వీటిని ర్యాలీగా ప్రదర్శించారు.

ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయులు, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, నగర్ మేయర్ కోవెలముడి రవీంద్ర, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబధయ్య, రాష్ట్ర ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీల, గళ్ళా రామచంద్రరావు, పెద్ధ సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags-APTS Chairman Mannava Mohanakrishna Celebrates Nara Lokesh Birthday With Tableau

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles