మహేష్ బిగాల ఆధ్యర్యంలో గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సమావేశం

Featured Image

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావులపై జరుగుతున్న నిరాధార, రాజకీయ ప్రేరిత ఆరోపణలను ఖండిస్తూ గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సమన్వయకర్త మహేష్ బిగాల ఆధ్యర్యంలో అంతర్జాలంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ, కేసీఆర్ మేనిఫెస్టోలో పొందుపరచని అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. రైతుబంధు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలు కోట్లాది కుటుంబాల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా దారి తప్పిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన పాలకులు స్కాంల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం, గొర్రెల స్కామ్, ఫార్ములా–ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ అంటూ వరుసగా కేసులు పెట్టి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.

ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రతిపక్షాలను అణిచివేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎన్ఆర్ఐలు ఆందోళన వ్యక్తం చేశారు. పాలన వైఫల్యాలను దాచిపెట్టేందుకు కేసులు, విచారణలు, మీడియా ట్రయల్స్‌ను ఆయుధాలుగా వాడటం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఉద్యమ శక్తి అని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి అభివృద్ధి వరకు ప్రతి దశలో బీఆర్ఎస్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని, ఆ చరిత్రను ఎవరూ తుడిచివేయలేరని అభిప్రాయపడ్డారు.

Tags-Global NRI BRS Internet Meet 2026 By Mahesh Bigala

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles