ఏపీ క్రీడాకారుల కోసం నాట్స్ సంబరాల్లో శాప్ ప్రచారం

Featured Image

ఏపీలోని క్రీడాకారులను ప్రవాసాంధ్రులను పీ4 పథకం క్రింద ప్రోత్సహించాలని, దీనికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందజేస్తామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) ఛైర్మన్ అనిమిని రవి నాయుడు వెల్లడించారు.

టాంపాలోని నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల్లో ఏపీ ప్రభుత్వం తరఫున స్టాల్ ఏర్పాటు చేశారు. అద్భుతమైన క్రీడాంధ్రప్రదేశ్ రూపకల్పనకు ఆటగాళ్లకు ప్రవాసులు తోడ్పడాలని ఈ సందర్భంగా రవి కోరారు. క్రీడా సామాగ్రి, స్థానికంగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రవాసుల చొరవ చూపాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఈ స్టాల్‌ను సందర్శించి రవి కృషిని అభినందించారు.

Tags-SAP Chairman Animini RaviNaidu At NATS 8th Sambaralu Tampa

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles