విశాఖలో వైభవంగా లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కార ప్రదానోత్సవం

Featured Image

గత 23 ఏళ్లుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు, హరివంశరాయ్ బచ్చన్‌ల పుణ్యతిథిని పురస్కరించుకుని పద్మశ్రీ, పద్మభూషణ్, రెండు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లోక్‌నాయక్ ఫౌండేషన్ 24వ వార్షికోత్సవాన్ని ఆదివారం నాడు విశాఖపట్నంలోని హోటల్ దసపల్లాలో వైభవంగా నిర్వహించారు.

ఆచర్యల్ వెలమ సిమ్మన్నకు సాహిత్య పురస్కారం (రూ.2లక్షల నగదు), తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్, సెంట్రల్ లండన్ డిప్యూటీ మేయర్ ఆరేటి ఆర్యన్ ఉదయ్, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డా. నోరి దత్తాత్రేయుడు తరఫున డా.గన్ని భాస్కర్, డెట్రాయిట్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డా. వేములపల్లి రాఘవేంద్రచౌదరిలకు జీవన సాఫల్య పురస్కారాలు (తలా లక్ష రూపాయిలు) ఈ ఏడాది అందజేశారు.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్, ఏపీ ఉప-సభాపతి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సినీ నటి కోటిసూర్యప్రభల చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రవాసాంధ్ర ప్రముఖులు డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, పెద్దిబోయిన జోగేశ్వరరావులు పాల్గొన్నారు.

Tags-Loknayak Foundation 2026 Awards Ceremony In Visakhapatnam

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles