లండన్‌లో తాల్ సంక్రాంతి వేడుకలు

Featured Image

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో లండన్‌లో సంక్రాంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. లండన్, పరిసర ప్రాంతాల నుంచి 700 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బొమ్మల కొలువు, భోగి పళ్లు, ముగ్గుల పోటీ, వంటల పోటీ, గాలిపటాల తయారీ పోటీలు, తదితర కార్యక్రమాలతో వాతావరణం ఉత్సాహంగా మారింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్‌బ్రిడ్జ్ మేయర్ కౌన్సిలర్ బెవర్లీ బ్రూవర్, సమాజం పట్ల TAL నిబద్ధతను ప్రశంసించారు. సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒక వేదిక మీదకు తెచ్చేందుకు సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని, అంకితభావాన్ని ప్రశంసించారు. యువత తమ సాంస్కృతిక మూలాలను గుర్తించి ఆ భాండాగారాన్ని ముందుకు తీసుకువెళ్లవలసిన అవసరం ఉందని అన్నారు.

గిరిధర్, రాయ్.బి, విజయ్.బి, అనిల్ అనంతుల సహాయ సహకారాలతో TAL మహిళా సభ్యులు ఉమ గీర్వాణి, హిమబిందు, సురేఖ, స్వప్న.బి, స్వప్న.జి, శాలిని, జ్యోత్స్న, షాజ్మా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. నిధుల సేకరణ ప్రయత్నాలకు ట్రస్టీలు వెంకట్ నీల, రవి కుమార్ రెడ్డి మోచెర్ల, కోశాధికారి అనిల్ అనంతుల నాయకత్వం వహించారు.

TAL చేపట్టిన ప్రతి కార్యక్రమానికి మద్దతు, సహకారాన్ని అందించిన తల్లిదండ్రులు, సభ్యులు, వాలంటీర్లకు చైర్మన్ రవి సబ్బా కృతజ్ఞతలు తెలిపారు. TAL కల్చరల్ సెంటర్ (TCC) అందించే విభిన్న శిక్షణా తరగతుల గురించి ట్రస్టీ అశోక్ మాడిశెట్టి వెల్లడించారు. సంప్రదాయ నృత్యం, సంగీతం నుంచి భాషా బోధన వరకు, ఈ తరగతులు అన్ని వయసుల వారికీ తమ తెలుగు వారసత్వంతో కనెక్ట్ అవ్వడానికి శక్తివంతమైన వేదికను అందిస్తాయని తెలిపారు. మార్చి 21న జరగబోతున్న తాల్ ఉగాది 2026 వేడుకలకు కన్వీనర్ వాసు మేరెడ్డి ఆహ్వానించారు.

మురళి కె, విజయ్ బి, నాగ జి, రవి డి, వాజిద్, క్రాంతి ఆర్, శ్రీ రామ్ తదితర వాలంటీర్లకు గిరిధర్ పుట్లూర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రముగ్ధులను చేసే బొమ్మల కొలువు అలంకరణల నుంచి అద్భుతమైన రంగోలి పోటీ వరకు వేడుకలోని ప్రతి అంశాన్ని నిబద్ధత, కృషితో నిర్వహించారని తెలిపారు. TAL ట్రస్టీలు అనిల్ అనంతుల, రవి కుమార్ రెడ్డి మోచెర్ల, శ్రీదేవి ఆలెద్దుల, వెంకట్ నీల, అశోక్ మాడిశెట్టి, కిరణ్ కప్పెట, సత్య పెద్దిరెడ్డి తమ మద్దతును అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభిన్న సంప్రదాయ ప్రదర్శనలు, పాటలు, నృత్య కార్యక్రమాలు, నోరూరించే వంటకాలతో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

Tags-Telugu Association of London TAL 2026 Sankranthi Celebrations

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles