సౌదీలో ఘనంగా టాసా సంక్రాంతి

Featured Image

తెలుగు అసోసియెషన్ ఆఫ్ సౌదీ అరేబియా(టాసా) ఆధ్వర్యంలో సంప్రదాయ సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రవాస తెలుగువారు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 2019 నుండి రియాధ్ నగరంలో తెలుగు పండుగలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు స్వర్ణ స్వామి తిరుపతి తెలిపారు.

సాంస్కృతిక, వినోదభరిత కార్యక్రమాలతో పాటు ఉత్కంఠభరితంగా క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. మహిళలు ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మల ఆటలతో అలరించారు. ముగ్గుల పోటీలను సంధ్య గుగ్గిలం, శ్రీదేవి వాకాటి , విద్య గురజాల, కోకిల, నాగమణి, సింధు పోకూరి, స్రవంతిలు నిర్వహించారు. చిన్నారుల క్రీడ పోటీలను సంధ్య గుగ్గిలం, విద్య గురజాల, భాస్కర్ గంధవల్లి, మహేష్ ఉదయాన సమన్వయపరిచారు. మహిళల బ్యాడ్మింటిన్ లో బిందు భాస్కర్ ప్రథమ, సంధ్య ద్వితీయ, సాయికేదార్ తృతీయ స్థానాలు సాధించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలకు ముందుగా టాసా సంఘం క్రీడా పోటీలను నిర్వహిస్తుంది. ఈ సారి జరిగిన పోటీలలో రియాద్ రాంపేజ్ రాయల్స్ జట్టు విజేతగా నిలవగా, ఛాలెంజర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. కిడ్స్ సీనియర్స్ విభాగంలో ప్రజ్వాల్, జతిన్, గౌతమ్ కిడ్స్ జూనియర్స్ విభాగంలో భవిష్య, రిత్విక్, బ్రిందాలు విజయం పొందారు. విజేతలకు తెలుగు కళా క్షేత్రం అధ్యక్షుడు రేవెల్ అంథోని బహుమతులు ప్రధానం చేశారు.

టాసా ఉపాధ్యక్షుడు మహేంద్ర వాకాటి, సభ్యులు అనిల్ మర్రి, ఇబ్రహీం షేక్, నటరాజ్, అజయ్ రావూరి, సాయి, శివ, భాస్కర్, సాటా మల్లేశం, నూరోద్దీన్, సురేశ్, కోకిల, శ్రీనివాస్, తేజ, దేవదాస్ కనకాల, జమాల్, గులాం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Tags-TASA Sankranthi 2026 In Riyadh Saudi Arabia

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles