మలేషియాలో తెలుగు కార్మికులకు ముఖ్య గమనిక..ముగియనున్న క్షమాభిక్ష పథకం

Featured Image

ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబందుల్లో చిక్కుకొని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు మలేషియా ప్రభుత్వం మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం ఆమ్నెస్టీ(క్షమాభిక్ష) ప్రకటించింది. ఇది ఏప్రిల్ 30వ తేదీతో ముగియనుంది. ఈ గడువు లోపు పాస్పోర్ట్ లేకుండా వున్నవాళ్లు, వర్క్ పర్మిట్ వీసాల గడువు ముగిసినవారు ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా భారత్‌కు వెళ్ళవచ్చు.

ఈ ఆమ్నెస్టీ ద్వారా తమ స్వదేశాలకు వెళ్లేవారు 500 రింగ్గిట్ మలేషియా(ఇండియన్ కరెన్సి లో రూ 10000) చెలించాల్సి ఉంటుంది. పాసుపోర్టు లేని వారు ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్, సొంతంగా వారం రోజుల్లో వెళ్లే విధంగా ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కార్మికులు మలేషియాలో పనిచేస్తున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్రమ కార్మికులుగా నివసిస్తున్నారు. ఏజంట్లు మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఇస్తామని ఆశ చూపి ఈ కార్మికులను విజిట్ వీసా పైన తీసుకువచ్చి వర్క్ పర్మిట్ ఇవ్వకుండా మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈ కార్మికులు ఎక్కువగా పామ్ ఆయిల్ తోటలలో, రబ్బర్ తోటలలో, కన్స్ట్రక్షన్, హోటళ్లల్లో పనిచేస్తున్నారు.

ఏప్రిల్ 30వ తేదీ లోపు ఈ అవకాశాన్ని వాడుకోని వారిపై మలేషియా అధికారులు కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. గడువు ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టి, అక్రమ వలసదారులను గుర్తించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకసారి అరెస్ట్ అయితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి రావచ్చు.

ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదయినా సహాయం కావలసినవారు ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్ , మలేషియాను info@fnca.com.my లేదా www.fnca.com.my సంప్రదించాలని ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు.

Tags-Malaysia Amnesty Program Ends April 30th Important Notice To Illegal Telugu Workers

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles