భారాసలోకి భారీగా యూకె ఎన్నారైల జేరిక

🕑 Published: March 28, 2026 at 07:24 PM CST

యూకేలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సభ్యులు చేరినట్లు మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. కెసిఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరుతున్నామని ఎన్నారైలు పేర్కొన్నారు.

హరిబాబు నవపేట్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో యూకే కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కొత్తగా చేరిన సభ్యులకు స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. సోషల్ మీడియా తో పాటు లండన్‌లో కూడా అవసరమైతే నిరసన కార్యక్రమాలు నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమైందని నవీన్ రెడ్డి తెలిపారు.

అనిల్ కూర్మాచలం గత 15 సంవత్సరాలుగా లండన్‌లో పార్టీ కార్యకలాపాలను వివరించారు. ఎన్నారైలు పార్టీకి అందిస్తున్న సహకరాన్ని అభినందించారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకులు ఎన్నారైలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ఉద్యమం నుంచి ఇప్పటివరకు వచ్చిన అనుభవాలను ప్రస్తావిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. సత్యమూర్తి చిలుముల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

రత్నాకర్ కడుదుల పార్టీ కార్యక్రమాలను మరింత చురుకుగా కొనసాగించాలని పేర్కొన్నారు. రవి ప్రదీప్ గౌడ్ పులుసు ప్రభుత్వం చర్యలపై విశ్లేషణాత్మకంగా స్పందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం రమేష్ ఎసెంపల్లి వందనాలతో ముగిసింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ జెల్ల, దొంతుల వెంకట్ రెడ్డి, అబూ జాఫర్, సురేష్ గోపతి, సురేష్ బుడగం, సత్యపాల్ రెడ్డి పింగలి, రమేష్ ఇస్సంపల్లి, నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, ప్రశాంత్ మామిడాల, అంజన్ రావు, పవన్ కుమార్ గౌడ్, తరుణ్ లునావత్ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
మలేషియలో కన్నులపండువగా సీతారాముల కళ్యాణంఎన్.టి.ఆర్ అవార్డు అందుకున్న చికాగో ప్రవాసాంధ్రురాలు శ్వేత కొత్తపల్లిఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించండి-న్యూజెర్సీలో APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణప్రవాస విద్యార్థులతో వినూత్నంగా తానా పాఠశాల కార్యక్రమంప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు - Vamsi International 2026 Ugadhi Awards For NRIsఒహాయోలో శంకర నేత్రాలయ నిధుల సేకరణకు సానుకూల స్పందనప్రధాని మోదీతో డా. దగ్గుబాటి దంపతుల భేటీటొరంటొలో వేడుకగా తాకా ఉగాదిరైతు నేస్తం ఫౌండేషన్-రఘోత్తమరెడ్డి మిద్దె తోటల పురస్కారాలు ప్రదానంలండన్‌ తెలుగు సంఘం 21వ వార్షికోత్సవంఒమన్‌లో శ్రీరాజరాజేశ్వరస్వామి కళ్యాణోత్సవంపరాభవ ఉగాది వేడుక నిర్వహించిన ఆస్ట్రియా తెలుగు సంఘంసందడిగా నార్వే తెలుగు సంఘం దశమ వార్షికోత్సవంసింగపూర్‌లో వైభవంగా ఉగాది వేడుకలుజపాన్...టోక్యోలో ఘనంగా పరాభవ ఉగాది సంబరంన్యూజెర్సీలో లక్షన్నర డాలర్లు విరాళం సేకరించిన శంకర నేత్రాలయపరాభవ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలుసింగపూర్‌లో పరాభవ నామ ఉగాది వేడుకలువైభవంగా జరిగిన TAGB ఉగాది సంబరాలుఏప్రిల్ 11న TAGDV ఉగాది వేడుకలు
Previous Article Next Article