విజయవాడలో వేడుకగా జయరాం అభినందన సభ
ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం అభినందన సభ విజయవాడ మురళీ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణతో పాటు పలువురు కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ.. కోమటి జయరాం పడిన కష్టానికి గుర్తింపు లభించిందన్నారు. చంద్రబాబు జయరాం వంటి కార్యకర్తలకు మరిన్ని పదవులు ఇవ్వాలని కోరారు. అమరావతి ఉద్యమం సమయంలో, చంద్రబాబు అక్రమ నిర్బంధ సమయంలో జయరాం కష్టపడ్డారని గుర్తుచేశారు. అమెరికాలో ఏ తెలుగువాడికి కష్టం వచ్చినా జయరాం ముందుంటారని కితాబిచ్చారు. ఆయనకు ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు.
జయరాం కష్టకాలంలో తెదేపా జెండాను ఇతర దేశాల్లో రెపరెపలాడించారని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. తాను అమెరికా వెళ్లిన సమయంలో ఐదారు రాష్ట్రాలు తీసుకెళ్లారని ఎన్‌ఆర్‌ఐలు ఎవరైనా ఆపదలో ఉంటే జయరాం ఆదుకుంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.
కార్యక్రమంలో తాళ్లూరి జయశేఖర్, పాతూరి నాగభూషణం, రఘురామరాజు, గంటా శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్, నటుడు రాజేంద్రప్రసాద్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సుజన చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Tags-Komati Jayaram Felicitation Meeting In Vijayawada
Gallery




Latest Articles
- Suresh Doki And Brknews Served Defamation Notice By Talluri Jayasekhar And Kolla Ashok
- 2026 Ata International Womens Day Celebrated In Dallas
- Appreciation Meeting For Komati Jayaram In Vijayawada
- Maryland Governor Wes Moore Invited To Ata 19Th Conference
- Saanvi Gullapalli Of Southlake Teaching Financial Literacy Classes
- Malaysia Amnesty Program Ends April 30Th Important Notice To Illegal Telugu Workers
- Ata Phoenix Celebrates 4Th Annual Womens Day
- Tana Foundation Ex Chairman Qhub Quality Matrix Vallepalli Sasikant Celebrates 50Th Birthday
- Shankarabharanam Book By Vamsi Launched In Singapore By K Viswanath Son Nagendranath
- Houston Telugu Cultural Assoc Tca Ugadi 2026
- Ata 2026 Conference Planning Meeting In Ellicott City
- Ashok Baddi As Michigan 56Th District State Rep Candidate
- Dr Haranath Policherla Appointed As Smu Governor Bod Chairman
- Nats 2026 Meet And Greet In Grapevine Kishore Kancharla Takes Charge As Chairman
- Nats Womens Day 2026 In Charlotte
- Taca Canada Telugu Ugadi 2026 In Toronto
- Komati Jayaram Takes Charge As Ap Special Representative In North America
- Tnilive Special Interview With The First And Only Female Linux Foundation Fellow Shuah Khan From Ongole Andhra Pradesh
- Tantex Women Health Yoga Session On March 7Th In Frisco
- Houston Telugu Cultural Association Golden Jubilee 2026