అట్లాంటాలో నటరాజ నాట్యాంజలి కూచిఫూడి అకాడమీ వార్షికోత్సవం

Featured Image

అట్లాంటాలో గత ఆదివారం నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి–2026 నిర్వహించారు. Dance for a Cause ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా అమెరికా-ఇండియాల్లో సేవా సంస్థలకు మద్దతుగా నిధులు సమీకరించారు. సేకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్ (The Place), శంకర నేత్రాలయ సంస్థలకు అందజేయనున్నారు.

ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందించారు. 4 సంవత్సరాల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారులు పాల్గొని భారతీయ శాస్త్రీయ నృత్యకళను ప్రదర్శించారు. కార్యక్రమం రూపకల్పన మరియు విద్యార్థుల శిక్షణలో అకాడమీ నృత్య గురువు నీలిమ గడ్డమనుగు ప్రధాన పాత్ర పోషించారు.

బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి, గిరిధర్ కొటగిరి, జ్యోత్స్న పాలకుర్తి, రమణ గంద్ర, సునీత పోట్నూరు, ఆది శ్రీనివాసన్, శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ, జనార్ధన్ పన్నెల తదితరులు పాల్గొన్నారు. వెంకట్ చుండీ, వెంకట్-ప్రణీత కాకుల, కిరణ్ పాషం, గోలి గౌతం, మారిపెల్లి పరిమళ-శ్రవణ్, పినిక కాత్యాయని, శ్రీవల్లి శ్రీధర్, డా. జొన్నలగడ్డ సుధాకర్, దుగ్గిరెడ్డి వెంకట్, శేఖర్, రఘు వలుసాని, శివ గడ్డమనుగు, జనార్ధన్ పన్నెలలు సహకరించారు.

Tags-Nataraja Natyanjali Kuchipudi Academy Atlanta Anniversary 2026

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles